ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యా ఓడిపోయే ప్రసక్తే లేదని స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ అన్నారు. ఒకవేళ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ విషయంలో వెనక్కి తగ్గితే ఆయనను హతమార్చే అవకాశం ఉందన్నారు.
దీంతో ఈ పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటారన్నారు. ఆ మేరకు ఆయనపై ఒత్తిడి ఉందన్నారు. ‘ఎక్స్’ స్పేసెస్ వేదికపై రిపబ్లికన్ పార్టీ ప్రతినిధులతో జరిగిన చర్చలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.