కుప్పం నియోజకవర్గ వైసిపి ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా రామకుప్పం మండలం పిఎంకె తాండాకు చెందిన భాస్కర్ నాయక్ ను నియమిస్తూ జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ భరత్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా భాస్కర్ నాయక్ మాట్లాడుతూ. తనపై ఎంతో నమ్మకంతో పదవి అప్పగించిన సిఎం వైఎస్ జగన్, మంత్రి పెద్దిరెడ్డి, ఎమ్మెల్సీ భరత్ కు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.