బుచ్చయ్యపేట చెరుకు కాటా వద్ద 40 రోజులుగా చెరుకు లోడింగ్ చేస్తున్న కూలీల చార్జీలు అందకపోవడంతో వారు పనులు నిరాకరించారు. స్పందించిన జడ్పీటీసీ దొండా రాంబాబు బుధవారం చెరుకు కాటా వద్దకు చేరుకొని వారి సమస్యలు తెలుసుకున్నారు. ఎమ్మెల్యే ధర్మశ్రీ ఆదేశాలుతో కాంట్రాక్టర్, ఫ్యాక్టరీ ఎమ్‌డి లతో జడ్పీటీసీ ఫోన్లు మాట్లాడారు. కూలీలు చార్జీలు చెల్లిస్తామని కాంట్రాక్టర్ హామీ ఇచ్చారన్నారు. లోడింగ్ చేయాలనీ కూలీలను కోరారు.