రైతులకు ప్రజలకు తీవ్ర నష్టం కలిగించే భూహక్కు చట్టాన్ని జగన్ ప్రభుత్వం రద్దు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్య దర్శివర్గ సభ్యుడు మంతెన సీతా రాం డిమాండ్ చేశారు. సీపీఎం కార్యాలయంలో ఏలూరు జిల్లా కమిటీ సమావేశం రామకృష్ణ అధ్యక్షతన మంగళవారం జరిగింది. చిన్న, సన్నకారు రైతుల కు ఈ చట్టం ప్రమాదకరమన్నారు. కిందిస్థాయి కోర్టులకు వెళ్లకుండా చట్టంలో పే ర్కొనడం దుర్మార్గం అన్నారు. చిన్న రైతులకు హైకోర్టుకు వెళ్లే సామర్థ్యం ఉంటుందా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ కార్మిక సమస్యలు పరిష్కరించకుండా అణచివేతకు పాల్పడుతుందని దుయ్యబట్టారు. జిల్లా కార్యదర్శి రవి మాట్లాడుతూ చింతలపూడి ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని పూర్తి చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం గా వ్యవహరిస్తుందన్నారు. రైతుల ఉద్యమానికి సీపీఎం మద్దతు ఇస్తుందన్నారు. ప్రసాద్, కిషోర్, లింగరాజు, నాగమణి, రాజు, జీవరత్నం, సోమయ్య పాల్గొన్నారు.