ప్రభుత్వం డీఎస్సీ–2024 నోటిఫికేషన్ ద్వారా అమలు చేయనున్న అప్రంటిస్ విధానంపై నిరసన పెల్లుబుకుతోంది. ఈ విధానం రద్దు చేయాలని యూటీఎఫ్ ఆ ధ్వర్యంలో మంగళవారం డీఎస్సీ జీవో ప్రతి దహనం చేశారు. యూటీఎఫ్ నాయకులు బుచ్చిబాబు మాట్లాడుతూ 30 ఏళ్లు పోరాడి సాధించుకున్న అప్రంటిస్ రద్దును ముఖ్యమంత్రి జగన్ అమలులోకి తీసుకురావడం దారుణమన్నారు. ఏ శాఖలో అప్రంటీస్ విధానంలేదని, విద్యాశాఖలో ఉపాధ్యా యులకు శాపమన్నారు. తిరోగమన జీవోను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. యూటీఎఫ్ నాయకులు దామోధర్, చెంచెం రాజు, ప్రేమ్‌కుమార్, శ్రీను, వెంకటేశ్వరరావు, రాము, సురేష్, బాలకృష్ణ పలువురు పాల్గొన్నారు.