బాల్య వివాహాల నిర్మూలనకు అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యుడు సీతారాం విజ్ఞప్తి చేశారు. అనకాపల్లి పోలీస్ అతిథి గృహంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన
భేటీ బచావో భేటీ పడావో సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. రాష్ట్రంలో జరిగే ప్రతి వివాహానికి జనన ధ్రువీకరణ పత్రాలను పరిశీలించాలన్నారు.