పి. గన్నవరం మండల పరిషత్ మాజీ అధ్యక్షురాలు అంబటి భూలక్ష్మి, కోటేశ్వరరావు దంపతులు బుధవారం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును మంగళగిరిలోని ఆయన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 25వ తేదీన మండలంలోని ముంగండ గ్రామంలో నిర్వహించనున్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ ప్రతిష్ట మహోత్సవానికి హాజరుకావాలని వారు చంద్రబాబును కోరుతూ ఆహ్వాన చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.