ఈ నెల 17 వ తేదీన బాపట్ల పార్లమెంట్ పరిధిలో ‘రా కదిలిరా’ సభ నిర్వహించనున్నారు. జగన్ అరాచక పాలనను సాగనంపేందుకే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ‘రా కదిలిరా’ సభతో శంఖారావం పూరిస్తున్నారని ఆపార్టీ బాపట్ల పార్లమెంట్ అధ్యక్షుడు, పర్చూరు ఎమ్మోల్యే ఏలూరి సాంబశివరావు తెలిపారు. ఈ నెల 17న బాపట్ల పార్లమెంట్ పరిధిలో రా కదిలిరా బహిరంగ సభ ఇంకొల్లులో నిర్వహిస్తున్నారన్నారు. జగన్ ప్రభుత్వం సాగిస్తున్న అరాచకాన్ని వివరించి ప్రజలను చైతన్యం చేసేందుకు రా కదిలిరా పేరుతో చంద్రబాబు ఈనెల 17న ఇంకొల్లులో తారకరామ విజయభేరి ప్రాంగణంలో సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందుకు సుమారు లక్ష మంది లక్ష్యంగా భారీ ఏర్పాట్లు చేస్తున్నట్టు ఏలూరి సాంబశవరావు చెప్పారు.