ఎలకా్ట్రనిక్ ఓటింగ్ యంత్రాలపై ఆయా రాజకీయ పార్టీలు, పోటీ చేసే అభ్యర్థులు అవగాహన కల్పిగి ఉండాలని శ్రీకాకుళం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మన్‌జీర్ జిలానీ సమూన్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో గుర్తింపు గల రాజకీయ పార్టీల ప్రతినిధులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఏవీఎంలు, వీవీ ప్యాట్లు, కంట్రోల్ యూనిట్లపై అవగాహన కల్పించేందుకు భారత ఎన్నికల సంఘం ముద్రించిన ప్రత్యేక హ్యాండ్ బుక్‌ను ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు. పోలింగ్ నిర్వహన మొదలు సాంకేతిక అంశాలు, ఆయా పరికరాల పూర్తి వివరాలు హ్యాండ్ బుక్‌లో ఉంటాయని, వీటిలో ప్రతీ అంశాన్ని తెలుసుకుని ఉండాలన్నారు. వీటిని ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఉచితంగా అందజేస్తామని చెప్పారు. ఈవీఎంల సాయంతో ఓటింగ్ ప్రక్రియ, అలాగే వీవీ ప్యాట్‌లపై ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా సంచార ప్రదర్శన వ్యాన్లతో ప్రదర్శనలు నిర్వహిస్తామన్నారు. డెమో ఈవీఎంల ద్వారా స్వయంగా ఓటు వేసి తమ అనుమానాలను ఓటర్లు నివృత్తి చేసుకుంటారని చెప్పారు. సమావేశంలో డీఆర్వో ఎం.గణపతిరావు, పార్టీల ప్రతినిధులు పీఎంజే బాబు(టీడీపీ), రౌతు శంకరరావు(వైసీపీ) మల్లిబాబు (కాంగ్రెస్), సురేష్‌సింగ్ బాబు (బీజేపీ), డి.గోవిందరావు (సీపీఎం) తదితరులు పాల్గొన్నారు.