ఏపీ జేఏసీ ఉద్యమ కార్యాచరణను విజయవంతం చేయాలని జమ్మలమడుగు జేఏసీ ఛైర్మన్ పి.నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం జమ్మలమడుగులో ప్రభుత్వ ఆస్పత్రిలో అలాగే ప్రభుత్వ పెన్షనర్ల సంఘం సభ్యులతో, నాయకులతో వారు సమావేశం అయ్యారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమ శంఖారావం పూరించబోతున్నట్లు వారు తెలిపారు. కార్యాచరణలో భాగంగా ప్రభుత్వ కార్యాలయాల్లో, పాఠశాలలో ఉద్యోగ, ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరుకావాలని తహసీల్దారు కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దారు వేణుగోపాల్‌కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు, సెక్రటరి రఘునాథరెడ్డి, మహిళా నాయకురాలు లీలారాణి, పెన్షనర్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు పొన్నారి దస్తగిరి, అధ్యక్షుడు దేవదానం, రామచంద్రారెడ్డి, సుబ్బారెడ్డి, ప్రభుత్వ ఆస్పత్రి వద్ద నర్శింగ్ సిబ్బంది పాల్గొన్నారు.