బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వాహనానికి డ్రైవర్‌గా మారారు. రాష్ట్రంలోని ససారంలో కొనసాగుతున్న జోడో న్యాయ్ యాత్రలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జీపు నడుపుతూ రాహుల్‌తో ముచ్చటించారు. ఇతర కాంగ్రెస్ నాయకులు సైతం జీపులో వెనక ఉన్నారు. ఈ ఫొటోలను తేజస్వీ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు.