40 వేల విలువ చేసే కర్ణాటక మద్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న వ్యక్తిని గంగవరం పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఎస్ఐ ప్రతాప్ రెడ్డి కథనం మేరకు, మండలంలోని కుక్కలదొడ్డి క్రాస్ వద్ద తన సిబ్బందితో వాహనాలను తనిఖీ చేశారు. కర్ణాటక నుంచి బైక్‌లో వస్తున్న బైరెడ్డిపల్లి చెందిన శరవన్కుమార్ను ఆపి తనిఖీ చేశారు. బైక్ వెనుక రెండు సంచుల్లో 10 కేసులు మద్యాన్ని తరలిస్తున్నట్లు గుర్తించి అతడిని అరెస్ట్ చేశారు.