ముంబైలోని ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్‌ఫోర్ట్‌లో వీల్‌చైర్ లేకపోవడంతో ఓ వృద్ధుడు(80) ప్రాణాలు కోల్పోయాడు. ఆయన తన భార్యతో కలిసి ఈనెల 12న న్యూయార్క్ నుంచి ఎయిర్ఇండియా విమానంలో ముంబైకి చేరుకున్నాడు.
సిబ్బంది వారికి ఒక వీల్‌చైర్‌ను ఇచ్చి, మరోదాని కోసం కొద్దిసేపు వేచి ఉండాలని సూచించారు. కానీ, ఆయన వెయిట్ చేయకుండా దాదాపు 1.5కి.మీ. నడవడంతో ఆయాసపడి కుప్పకూలి, మృతిచెందాడు.