పేద, మధ్య తరగతి విద్యార్థులు సైతం అంతర్జాతీయ వర్సిటీలు అందించే కోర్సులను ఉచితంగా చదివేందుకు వీలు కల్పిస్తూ, ఉన్నత విద్యారంగంలో మరో విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టిన జగనన్న ప్రభుత్వం. ప్రముఖ ఆన్లైన్ కోర్సుల సంస్థ 'ఎడెక్స్'తో రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందం చేసుకోనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో.. రేపు(శుక్రవారం) సీఎం క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం, ప్రపంచ స్థాయి వర్సిటీ కోర్సులను అందించే ప్రముఖ ఈ-లెర్నింగ్ ప్లాట్ఫామ్ "ఎడెక్స్"ల మధ్య ఒప్పందం జరగనుంది. టీచింగ్, లెర్నింగ్ కోసం కొత్త టెక్నాలజీ, బోధనా విధానాలను సంయుక్తంగా రూపొందించిన ఎడెక్స్, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ.