కాంగ్రెస్ పార్టీ ఖాతాలను ఆదాయపు పన్ను శాఖ ఫ్రీజ్ చేసిందని కాంగ్రెస్ కోశాధికారి అజయ్ మాకెన్ శుక్రవారం పేర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా ఆ పార్టీకి ట్యాక్స్ ట్రిబ్యునల్‌లో ఊరట లభించింది.
ఫ్రీజ్ అయిన ఖాతాలు పనిచేస్తాయని, పార్టీ బ్యాంకు ఖాతాలను యాక్సెస్ చేసుకోవచ్చని ట్యాక్స్ ట్రిబ్యునల్ తెలిపింది. ఎన్నికలకు ముందు బ్యాంకు ఖాతాలను ఇన్‌కమ్ ట్యాక్స్ ఫ్రీజ్ చేయడంపై కాంగ్రెస్ సందేహాలు వ్యక్తం చేస్తోంది.