ప్రముఖ చెఫ్, పద్మశ్రీ అవార్డు గ్రహీత ఖురేషీ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 93 ఏళ్ల వృద్ధుడు వివిధ రకాల ప్రత్యేకమైన వంటకాల్లో మాస్టర్. 1931లో లక్నోలో జన్మించిన ఖురేషీ తన వంటకాల రుచికి ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. అలాగే.. ఐటీసీ హోటల్స్‌లో మాస్టర్ చెఫ్‌గా పనిచేసిన ఆయన పాక కళల్లో చేసిన కృషికి గానూ 2016లో భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది.