జైపూర్ ఎయిర్పోర్ట్ అధికారిక ఐడీకి ‘డాన్ ఆఫ్ ఇండియా’ అనే ఐడీ నుంచి శుక్రవారం ఈ-మెయిల్లో బెదిరింపు వచ్చింది. వెంటనే విమానాశ్రయ భద్రతా సిబ్బందితో పాటు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్(BDS)తనిఖీలు చేపట్టింది.
ఈ నేపథ్యంలో BDS, CISF, డాగ్ స్క్వాడ్ బృందం విమానాశ్రయంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించింది. సెర్చ్ ఆపరేషన్లో ఎయిర్పోర్టులో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించకపోవడంతో భద్రతా సంస్థలు ఊపిరి పీల్చుకున్నాయి.