సీఎం జగన్ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలైందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. బాపట్ల జిల్లా ఇంకొల్లులో నిర్వహించిన ‘రా.. కదలిరా’ సభలో ఆయన మాట్లాడారు.
52 రోజుల్లో టీడీపీ-జనసేన ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తమకు అడ్డు వస్తే తొక్కుకుంటూ పోతామని హెచ్చరించారు. అక్రమ కేసులతో తమ గెలుపును ఆపలేరని పేర్కొన్నారు.