కేంద్ర ప్రభుత్వ హామీతో 'ఢిల్లీ ఛలో' మార్చ్‌ను రైతులు 2 రోజుల పాటు నిలిపి వేశారు. పప్పు ధాన్యాలు, మొక్కజొన్న, పత్తి పంటలను 5 ఏళ్ల పాటు ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా MSPకి కొనుగోలు చేస్తామని కేంద్రం హామీఇచ్చింది.
కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, పీయూష్ గోయల్, నిత్యానంద్ రాయ్ చండీగఢ్‌లో ఆదివారం రైతులతో సమావేశం అయ్యారు. సోమవారం తెల్లవారుజాము వరకు చర్చలు జరిగాయి. అనంతరం రైతులు తమ నిర్ణయం ప్రకటించారు.