న్యూఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేరిన కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ చికిత్స తర్వాత డిశ్చార్జ్ అయినట్లు సోమవారం వర్గాలు తెలిపాయి. నివేదికల ప్రకారం, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి డీహైడ్రేషన్ మరియు కడుపు ఇన్ఫెక్షన్ కారణంగా ఫిబ్రవరి 16న సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేరారు. అయితే తాను యూపీలో రాహుల్ యాత్రలో పాల్గొనాలని అనుకున్నా అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరాల్సి వచ్చిందని తన ఆరోగ్యం మెరుగుపడిన వెంటనే జోడో న్యాయ్ యాత్రలో పాల్గొంటానని ప్రియాంక గాంధీ తెలిపారు.