చంద్రబాబు ఆడవాళ్లను అస్యహించుకుంటే.. అయితే మహిళకు సాధికారతతో సమాజం వృద్ధి చెందుతుందని సీఎం జగన్ బలంగా నమ్మారని తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి అన్నారు. సోమవారం ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘జగన్ పాలన - మహిళ స్పందన’ రాష్ట్రస్థాయి మహిళా సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. రామ్ మనోహర్ లోహియా మహిళా పక్షపాతి.. అలాగే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మహిళా సంస్కర్త. ఇందిరాగాంధీ మహిళల స్థితి గతులు తెలుసుకునేందుకు రామచంద్రగుహ కమిటీ వేశారు. ఆ కమిటీ ఓ నివేదిక ఇచ్చింది. 16 ఏళ్ల ఇందిరాగాంధీ పాలనలో కూడా మహిళల స్థితిగతులు మారలేదు.. ఆ కమిటీ నివేదిక ఇచ్చినా ఇబ్బందులు తొలగిపోలేదు. అలాంటిది.. ఇందిరాగాంధీ చేయలేని పనిని సీఎం జగన్ చేసి చూపించారు అని అన్నారు.