ఏపీలోని విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకే కేంద్రం మొగ్గుచూపుతోంది. తాజాగా పరిశ్రమకు చెందిన స్థలాల అమ్మకాలను వేగవంతం చేసింది.
మద్దిలపాలెంలో 22.90 ఎకరాలు, గాజువాకలో 2 ఎకరాలు, పెదగంట్యాడలో 434 చదరపు గజాల అమ్మకానికి ప్రకటన విడుదల చేసింది.
వీటి విలువ రూ.1600 కోట్ల వరకు ఉంటుంది. కాగా, పరిశ్రమకు గనులు కేటాయించి, ఆర్థిక భరోసా కల్పించాలని, సెయిల్‌లో విలీనం చేయాలని కార్మికులు కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు.