బాపులపాడు మండలం వేలేరు గ్రామంలో నడి రోడ్డుపై వైస్సార్ విగ్రహా ఏర్పాటు చేస్తున్నారు. విగ్రహా ఏర్పాటును సవాలు చేస్తూ తెదేపా నేతలు, గ్రామస్తులు కోర్ట్ ను ఆశ్రయించారు. విగ్రహా ఏర్పాటు చేయడాన్ని నిలిపివేయాలని కోర్ట్ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది. ఐనా నిర్మాణ పనులు కొనసాగడంతో ఇరువర్గాల మధ్య వివాదం తలెత్తింది. మంగళవారం గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు.