అమెరికా ఒమాహాలోని హెన్రీ డోర్లీ జూ అండ్ అక్వేరియంలో మొసలి కడుపులో నాణేలు లభ్యమయ్యాయి. ఈ ఘటనతో జూ అధికారులు, పశువైద్యులు షాకయ్యారు. తిబోడాక్స్ అనే మొసలి తిండి తినడం మానేసింది. దాంతో జూ సిబ్బంది దానికి స్కానింగ్ చేయించారు. రిపోర్ట్‌లో దాని కడుపులో నాణేలు కనిపించాయి. వెంటనే వైద్యులు మొసలికి శస్త్రచికిత్స చేసి 70కి పైగా నాణేలు తొలగించారు. దాంతో ఆ మొసలి ప్రాణాలను రక్షించారు. జూలో నాణేలను వేయవద్దని ప్రజలను సిబ్బంది కోరారు.