పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం కోసం ఆందోళన చేస్తున్న రైతులు.. కేంద్ర ప్రభుత్వానికి డెడ్‌లైన్ విధించారు. నేడు ఉదయం 11 గంటలకల్లా ప్రభుత్వం స్పందించాలని,
లేకపోతే ఢిల్లీ చలో కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఏం జరిగినా కేంద్రమే బాధ్యత వహించాలన్నారు. డెడ్‌లైన్ ముగిసిన తర్వాత ఢిల్లీ వైపు తమ ప్రయాణం కొనసాగిస్తామని రైతు నాయకులు వెల్లడించారు.