పాకిస్థాన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ), పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్(పీఎంఎల్-ఎన్)ల మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది.
ప్రధానిగా పీఎంఎల్-ఎన్ అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్, అధ్యక్షుడిగా పీపీపీ కో ఛైర్మన్ ఆసిఫ్ జర్దారీ బాధ్యతలు చేపడతారని మంగళవారం అర్థరాత్రి సంయుక్త వార్తా సమావేశంలో పీపీపీ, పీఎంఎల్‌ఎన్ నేతలు ప్రకటించినట్లు జియో న్యూస్ పేర్కొంది.