వలేటివారిపాలెం మండలంలో జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం 2022-23 ఆర్ధిక సంవత్సరంనకు సంబందించిన సోషల్ ఆడిట్ జరుగుతుందని ఎంపిడిఓ రపిక్ అహ్మద్ బుధవారం తెలియజేశారు. జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకానికి సంబందించిన సామాజిక తనిఖీ బృందాలు ఈ నెల 22 నుండి 26 వరకు మండలంలోని గ్రామాలలో గ్రామసభలు నిర్వహిస్తారని 27న మండల ప్రజాపరిషత్ కార్యాలయం ఆవరణలో సామాజిక తనిఖీ ప్రజా వేదిక నిర్వహించడం జరుగుతుందని ఎంపీడీవో తెలిపారు.