అమెరికాను ఇప్పటివరకూ ఏలిన మొత్తం 45మంది అధ్యక్షులలో డొనాల్డ్ ట్రంప్ అత్యంత చెత్త అధ్యక్షునిగా అభివర్ణిస్తూ ఒక సర్వే ఫలితాలు వెలువడ్డాయి.
ఈ జాబితాలో ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ 14వ స్థానంలో నిలిచారు. ఈ సర్వేను నిర్వహించిన రాజకీయ విశ్లేషకులు జస్టిన్వాన్, బ్రాండన్ రోటింగ్హాస్ మాట్లాడుతూ బైడెన్ సాధించిన విజయాలలో.. ట్రంప్ నుంచి అధ్యక్ష పదవిని కాపాడటమే ప్రధానమైనదని పేర్కొన్నారు.