ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్ర ప్రయోజనాలకోసమే పొత్తు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 21, 2024, 08:31 PM

రాష్ట్రాన్ని కాపాడుకునేందుకే జనసేన ఇతర పార్టీలతో పొత్తు కుదుర్చుకుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. టీడీపీ - జనసేనతోపాటు బీజేపీతో పొత్తు కుదుర్చుకునేందుకు తాను ఎన్నో అవమానాలు ఎదుర్కున్నానని పవన్ వ్యాఖ్యానించారు. "ఎన్నికల్లో ప్రతిపక్ష ఓటు చీలితే సీఎం జగన్ లాభపడతారు. ఇది జరగకుండా ఉండేందుకే పొత్తుకు నిర్ణయించాం. అయితే అది అంత సులభంగా జరగలేదు. పొత్తు కోసం వెళ్లిన నేను జాతీయ నాయకత్వంతో ఎన్ని తిట్లు తిన్నానో నాకు తెలుసు. వాళ్లను ఒప్పించడానికి చాలా కష్టపడ్డాను. అనేక అవమానాలకు గురయ్యాను. స్వలాభం కోసం పొత్తును ఆశించలేదు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎంత దూరమైన వెళ్తాను. అందుకే తిట్టినా భరించాను. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఉండాలని కోరుకుంటున్నా" అని పవన్ వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com