రైతుల సమస్యలకు చర్చలు ఒక్కటే పరిష్కారమని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. వారే ఈ దేశానికి అన్నదాతలని, వారితో చర్చించేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
యూపీఏ తో పోలిస్తే మోదీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే రైతులకు ఎక్కువ నిధులు కేటాయించామన్నారు. బుధవారం రాత్రి ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. అనంతరం అనురాగ్ ఠాకూర్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.