పుల్లలచెరువులో దివంగత వైసీపీ నాయకులు కంచర్ల వీరయ్య జ్ఞాపకార్థం ప్రజలకు త్రాగునీటిని అందించేందుకు ఉచితంగా 10 ట్యాంకర్లను ఏర్పాటు చేసినట్లు కేవి యూత్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసిపి ఇన్చార్జి తాటిపర్తి చంద్రశేఖర్ ఆదేశాల మేరకు త్రాగునీటిని అందించేందుకు ముందుకు వచ్చినట్లుగా వారు తెలిపారు. భూగర్భ జలాలు అడుగంటి బోర్ల ద్వారా చుక్కనీరు రాకపోవడంతో తాము నీటిని సరఫరా చేస్తున్నట్లుగా తెలిపారు.