ఓటమి భయంతోనే మీడియాపై రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దాడులు చేయిస్తున్నారని టిడిపి జిల్లా అధ్యక్షులు నూకసాని బాలాజీ ఆరోపించారు. ఒంగోలులోని టిడిపి కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ల్యాండ్, సాండ్, వైన్, మైన్, మాఫియాతో పాటు, అత్యాచారాలు, హత్యలను వెలుగులోకి తెస్తున్న ఫోర్త్ పిల్లర్ ఎస్టేట్ పై దాడి చేయించడం జగన్ రెడ్డి నిరంకుశత్వ పాలనకు అద్దం పడుతుందని తెలిపారు.