మహిళల ఆర్ధికశక్తిని పెంపొందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అహ్మదాబాద్లో ‘గుజరాత్ సహకార మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్’ స్వర్ణోత్సవాల్లో పాల్గొన్న మోదీ ప్రసంగిస్తూ..
దేశంలో డెయిరీ రంగం పురోభివృద్ధి వెనుక నారీశక్తి పాత్ర అద్వితీయమని ప్రశంసించారు. ఈరోజు ప్రపంచ డెయిరీ రంగంలో భారత్ ప్రబలశక్తిగా ఎదిగిందన్నారు. మన డైరీ పరిశ్రమ టర్నోవర్ రూ.10 లక్షలకోట్లకు పెరిగిందని చెప్పారు.