వచ్చేనెల మూడో తేదీన చేపట్టనున్న పల్స్‌పోలియో కార్యక్రమంలో జిల్లాలో 0-5 సంవత్సరాల్లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని తిరుపతి కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2,53,282 మంది పిల్లల కోసం 3,36,860 డోసులు వచ్చాయన్నారు. 1,824 పల్స్‌పోలియో కేంద్రాలు, 83 మొబైల్ వాహనాలు, 185 రూట్లు, 59 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 7,774 మంది సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మొదటి రోజు వేసుకోని పిల్లలకు 4, 5 తేదీల్లో ఇంటింటికీ వెళ్లి వేయాలని డీఎంహెచ్‌వో శ్రీహరిని ఆదేశించారు. అనంతరం పల్స్‌పోలియోకు సంబఽంధించి వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈకార్యక్రమంలో డీఈవో శేఖర్, స్త్రీశిశు సంక్షేమ శాఖ పీడీ జయలక్ష్మి, డీఐవో శ్రీనివాసులు పాల్గొన్నారు.