ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ను మరో రెండు, మూడు రోజుల్లో అరెస్ట్ చేస్తారని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్ అన్నారు. ఢిల్లీలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. అరెస్ట్ నోటీసు రేపు అందే అవకాశం ఉందన్నారు. I.N.D.I.A కూటమిలో చేరొద్దని ఆప్‌పై ఒత్తిడి ఉందన్నారు. లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్‌తో ఆప్ పొత్తు కొనసాగుతోందని, దర్యాప్తు సంస్థలకు తాము భయపడేది లేదన్నారు.