ఏపీలో వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణశాఖ. ఆగ్నేయ మధ్యప్రదేశ్ నుంచి తమిళనాడు వరకు ఉన్న నిన్నటి (ద్రోణి ఇప్పుడు మరఠ్వాడా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్, మరియు యానాంలోలో దిగువ ట్రోపోయావరణములో దక్షిణ/నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి. ఈ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు.
ఉత్తర కోస్తాలోని పలు జిల్లాల్లో రాబోయే రెండ్రోజుల్లో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు వాతావరణశాఖ అధికారులు. కొన్ని జిల్లాల్లో పొగమంచు ఒకటి, రెండు చోట్ల కురిసే ఛాన్స్ ఉందంటున్నారు. దక్షిణ కోస్తాలో కూడా రాబోయే రెండు రోజుల్లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి వానలకు అవకాశం ఉందని చెబుతున్నారు. రాయలసీమలో కూడా తేలికపాటి వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. రెండు రోజుల పాటూ తేలికపాటి జల్లులు కురుస్తాయంటోంది.