కలకడ మండలం నుంచి సుమారు 25 కుటుంబాలకు చెందిన వారు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. శుక్రవారం మండలంలోని కదిరాయ చెరువు పంచాయతీ, కె. వడ్డీపల్లి, బొంతలవారిపల్లి గ్రామాలకు చెందిన ఆ కుటుంబాలు వైఎస్ఆర్సిపి నుండి సర్పంచ్ కె లక్ష్మీప్రసన్న ఆధ్వర్యంలో కలికిరి మండలం, నగిరిపల్లెలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, పీలేరు నియోజకవర్గం బాధ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సమక్షంలో టిడిపి తీర్థం పుచ్చుకున్నారు.