రాజాం నియోజకవర్గంలో పలు శ్రీవైష్ణవ దేవాలయాలలో స్వామివారికి ఆయా దేవాలయాల అర్చకులు ఘనముగా పూజలను నిర్వహించారు. శనివారం మాఘమాసం పౌర్ణమి కావటంతో ప్రాత కాలంలో స్వామివారికి అష్టోత్తర శతనామావళితో, విష్ణు సహస్త్ర నామాలతో అర్చకులు అర్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ రకాల పుష్పాలతో స్వామి వారికి అర్చన కార్యక్రమం జరిగింది. వేకువ జాము నుంచే స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు అత్యధికంగా విచ్చేశారు.