వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 370 సీట్లు గెలుచుకుంటుందని ప్రధాని మోదీ చెబుతున్న సంగతి తెలిసిందే. దీనిపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ సొంతంగా 370 సీట్లు గెలుచుకోలేదన్నారు. 370 సీట్ల సంఖ్య మాత్రమే పార్టీ కార్యకర్తలకు బీజేపీ పెట్టుకున్న లక్ష్యమని అన్నారు. ఇది బీజేపీకి ప్రతిష్టాత్మక లక్ష్యమని అన్నారు.