ప్రధాని మోదీ నేడు గుజరాత్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రూ.52,250 కోట్ల విలువైన ప్రాజెక్టులను ఆయన ప్రారంభించనున్నారు.
గుజరాత్లోని ఓఖా ప్రధాన భూభాగాన్ని, బేట్ ద్వారకా ద్వీపాన్ని కలిపే సుదర్శన్ సేతును ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం జాతికి అంకితం చేయనున్నారు. ఓఖా ప్రధాన భూభాగాన్ని, బేట్ ద్వారకా ద్వీపాన్ని కలిపే సుదర్శన్ సేతును దాదాపు రూ. 980 కోట్ల వ్యయంతో నిర్మించారు.