అన్నమయ్య జిల్లా రామాపురం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఐరిస్ గ్రాండ్ హోటల్ సమీపంలో ఆగిఉన్న లారీని ఓ స్కూటర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందారు. మృతులను సరస్వతి పల్లెకు చెందిన కృష్ణబాబు, గంగాభవాని, వినీతగా గుర్తించారు. వారు రాయచోటికి వెళుతుండగా ప్రమాదం జరిగినట్లు రామాపురం పోలీసులు తెలిపారు. కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa