యాడికి మండలంలోని రాయలచెరువుకు చెందిన ఓ యువకుడి అదృశ్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆసిఫ్ రాజా మదనపల్లెలోని ఓ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. మొదటి ఏడాదిలో కొన్ని సబ్జెక్టులు తప్పాడు. దాంతో బాగా చదువుకోవాలని తండ్రి మందలించాడు. కళాశా లకు వెళ్తున్నానని ఈనెల 15న ఇంటి నుంచి బయలు దేరాడు. కళాశాలకు వెళ్లక, ఇంటికీ రాకపోవడంతో తండ్రి హాజీబాషా సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.