అవినీతి నిరోధక అంబుడ్స్‌మెన్ లోక్‌పాల్ చైర్‌పర్సన్‌గా దాదాపు రెండేళ్ల తర్వాత సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఏఎం ఖాన్విల్కర్ మంగళవారం నియమితులయ్యారు. మే 27, 2022న జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ పదవీకాలం పూర్తయిన తర్వాత లోక్‌పాల్ రెగ్యులర్ చీఫ్ లేకుండానే పని చేస్తోంది. లోక్‌పాల్‌లో న్యాయవ్యవస్థ సభ్యుడు జస్టిస్ ప్రదీప్ కుమార్ మొహంతి ప్రస్తుతం తాత్కాలిక చైర్‌పర్సన్‌గా ఉన్నారు. జస్టిస్ ఖాన్విల్కర్ సుప్రీంకోర్టు నుండి జూలై 2022లో పదవీ విరమణ చేశారు. రిటైర్డ్ న్యాయమూర్తులు లింగప్ప నారాయణ స్వామి, సంజయ్ యాదవ్ మరియు రీతూ రాజ్ అవస్తీలను అవినీతి నిరోధక అంబుడ్స్‌మన్‌లో న్యాయ సభ్యులుగా నియమించినట్లు పేర్కొంది.