అంబేడ్కర్ కోనసీమ జిల్లా, పి.గన్నవరం(ఎస్సీ) నియోజకవర్గ టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం మంగళవారం రసాభాసగా ముగిసింది. టీడీపీ అభ్యర్థిగా సరిపెల్ల రాజేశ్(మహాసేన రాజేష్) పేరును ప్రకటించడాన్ని నిరసిస్తూ జనసేన శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఈ సీటును రాజేశ్‌కు కేటాయించడానికి జనసేనతో పాటు టీడీపీ కార్యకర్తలు కూ డా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం అంబాజీపేటలో టీడీపీ నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీనికి టీడీపీ జోన్-2 పరిశీలకుడు సుజయకృష్ణ రంగారావు హాజరయ్యారు. టీడీపీ జి ల్లా అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి, అమలాపురం పార్లమెంట రీ ఇన్‌చార్జి గంటి హరీశ్ మాధు ర్, పార్టీ పరిశీలకుడు షేక్ సుభా న్ హాజరయ్యారు. టీడీపీకి చెంది న 4 మండలాల సమన్వయ కమిటీ నేతలతో సంప్రదింపులు చేపట్టారు. తొలుత అయినవిల్లి మండల నేతలతో చర్చలు మొదలుపెట్టారు. ఇదే సమయంలో అక్కడ కు సమీపంలోని కొర్లపాటివారిపాలెంలో జనసేన నేతలు బుధవారం జరిగే తాడేపల్లిగూడెం సభపై చర్చించుకుంటున్నారు. టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరుగుతోందని తెలిసి వారంతా హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. మహాసేన రాజేశ్‌కు టికెట్ రద్దు చేయాలన్నారు. రాజేశ్ గో బ్యాక్ అంటూ నినాదాలు ఇచ్చారు. ఓ టీడీపీ నేత ఆయనతో మంతనాలు జరిపినట్లు తెలిసి.. అతడిపై దాడికి విఫలయత్నం చేశారు. కుర్చీలు, బల్లలను గాల్లోకి విసురుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో.. టీడీపీ నేతలు వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. లోపల గదిలో ఉన్న హరీశ్ బయటకు వచ్చి బుజ్జగించేందుకు ప్రయత్నిస్తుండగా.. జన సైనికులు ఆయనపై విరుచుకుపడ్డారు. టీడీపీ శ్రేణులను తోసుకుంటూ ప్రత్యేక గది లో సమావేశమైన టీడీపీ నేతలు రంగారావు, రెడ్డి అనంతకుమారి వద్దకు చొచ్చుకువెళ్లారు. పరిస్థితి చేజారడంతో రంగారావు, అనంతకుమారి, సుభాన్‌లను టీడీపీ నాయకులు గదిలో ఉంచి తలుపులు వేశారు. జనసైనికులు అక్కడే ఉన్న హరీశ్ కారు అద్దాలను ధ్వంసం చేశారు. వెంటనే టీడీపీ, జనసేన నేతలు జోక్యం చేసుకుని సర్దుబాటు చేశారు. పోలీసులు రావడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. తర్వాత హరీశ్.. జనసేన నేతలు శిరిగినీడి వెంకటేశ్వరరావు, వాసంశెట్టి కుమార్, దొమ్మేటి సాయికృష్ణ, అడబాల తాతకాపుల మంతనాలు జరిపారు. అనంతరం రంగారావు, సుభాన్, అనంతకుమారి, హరీశ్ మండలాల వారీగా టీడీపీ సమన్వయ కమిటీ నేతలతో సంప్రదింపులు కొనసాగించారు. రాజేశ్ ఎంపికకు దారితీసిన పరిస్థితులను కేడర్‌కు వివరించారు. వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. వీటిని అధిష్ఠానానికి నివేదిస్తామని రంగారావు ఆ తర్వాత విలేకరులకు వెల్లడించారు.