కాంగ్రెస్ పార్టీకి హిమాచల్ ప్రదేశ్‌లో ఊహించని షాక్ తగిలింది. మంగళవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో సొంత పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థికి ఓటేసి క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారు.
దీంతో హిమాచల్ అసెంబ్లీలో కాంగ్రెస్ బలం మైనారిటీకి పడిపోయింది. కాంగ్రెస్ పార్టీకి సంఖ్యా బలం లేనందున ప్రభుత్వ ఏర్పాటుకు తమకు అవకాశం ఇవ్వాలని బీజేపీ నేతలు గవర్నర్‌ను కోరనున్నట్లు తెలుస్తోంది. దీంతో గవర్నర్ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.