ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల ఎంపికపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల దృష్టి పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ టికెట్ల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించేందుకు హస్తం పార్టీ సిద్ధమైంది.
ఈ మేరకు వైఎస్ షర్మిల ఇవాళ, రేపు భేటీలు నిర్వహించనున్నారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో దరఖాస్తుదారులతో సంప్రదింపులు జరుపనున్నారు.