బుక్కరాయసముద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం వీడ్కోలు సభను నిర్వహించారు. ఈ కార్యక్రమం వైద్యాధికారులు డాక్టర్ స్వాతి లక్ష్మి, డాక్టర్ తహీరున్నిసా ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ గా పనిచేయుచున్న కుమారి భవాని, స్టాఫ్ నర్స్ ఉద్యోగం వచ్చినందున మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిన సందర్భంగా సిబ్బంది వీడ్కోల సభ ఏర్పాటు చేసి సన్మానించారు.