తిరుమల వెళ్లే నడకదారిలో పులులు, ఎలుగుబంట్లు వంటి క్రూరమృగాలు దాడిచేయకుండా శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలసిన టీటీడీ అధికారు లు నడకదారిలో సంకీర్తనలని ప్రకటించడంపై ఆంధ్రప్రదేశ్ సాధుపరిషత్ అధ్యక్షుడు, ఆనందాశ్రమ పీఠాధిపతి స్వామి శ్రీనివాసానంద ఆగ్రహంవ్యక్తం చేశారు. హాస్యాస్పదమైప నిర్ణయాలు తీసుకోవడం తగదు హితవుపలికారు. మంగళవారం గారపేటలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ క్రూరమృగాలు దాడి చేయకుండా రక్షణ కవచం ఏర్పాటుచేయాలని భక్తులు కోరుతుంటే టీటీడీ మాత్రం హాస్యాస్ప దమైన నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపించారు. గతంలో క్రూరమృగాలను ఎదుర్కోవడానికి భక్తులకు కర్రలు ఇచ్చిన టీటీపీ ఇప్పుడు సంకీర్తనలతో జంతువులను రాకుండా చేస్తామని హాస్యాస్పద నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. టీటీడీ నిర్ణయాలు జంతువులు దాడిచేసేలాచేసి ఆ దోషాలను వేంకటేశ్వరస్వామి కి ఆపాదించాలని చూస్తోందని భక్తులకు అనుమానాలు వస్తున్నాయన్నరు. ప్రమాదాలు జరిగిన తరువాత టీటీడీ నిర్వహించిన నాలుగు సమావేశాల్లో శాశ్వతమైన చర్యలు తీసుకోవడంపై మాట్లాడకపోవడం దారుణమన్నారు.