విశాఖ-బరంపురం రైలుకు ఆ శాఖ అధికారులు ఆమోదించారు. ఇప్పటివరకు విశాఖ-పలాస మధ్య నడుస్తున్న ‘మెమూ’ రైలును ఇచ్ఛాపురం మీదుగా ఒడిశాలోని బరంపురం వరకు కొనసాగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీఅయ్యాయి. ఈ మేరకు శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు హర్షం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా తూర్పుకోస్తా రైల్వే జీఎం మనోజ్‌శర్మ, ఖుర్దారోడ్ డీఆర్‌ఎం హెచ్‌ఎం బజ్వా, ఇతర అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. రైలు పొడిగింపుపై రైల్వే మంత్రి అశ్విన్ శ్రీవైష్ణవ్, వివిధ రైల్వే బోర్డు, డివిజన్ సమావేశాల్లో అధికారులను కలిసి వినతిపత్రాలు అందించినట్లు గుర్తుచేశారు. ప్రతిపాదనలకు ఆమోదం తెలపడంతో జిల్లాకు చెందిన ఉద్యోగులు, చిరువ్యాపా రులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు. ఇందుకు సహకరిం చిన రైల్వే ఉన్నతాధికారులకు ఈ సందర్భంగా ఎమ్పీ కృతజ్ఞతలు తెలిపారు.