మధ్యప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. బుందేల్‌ఖండ్ పరిధిలోని సాగర్‌లో రిటైర్డ్ పోలీసు హరిశ్చంద్ర అహిర్వార్ ఉంటున్నారు. అతనికి తొమ్మిది మంది కుమార్తెలు. కొడుకులు లేరు.
అయితే హరిశ్చంద్ర అహిర్వార్ అనారోగ్యం వల్ల కన్నుమూశాడు. ఈ నేపథ్యంలో అతని కుమార్తెలు తమ తండ్రికి తామే అంత్యక్రియలు చేయాలని నిర్ణయించుకుని అంత్యక్రియలు చేశారు. ఈ ఘటన స్థానికంగా చర్చాంశనీయంగా మారింది.